ఢిల్లీ క్యాపిటల్స్ ఎంపికైన త్రిపురాన విజయ్ కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. సోమవారం రాత్రి కోటబొమ్మాలి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో త్రిపురాన విజయ్ మంత్రిని గౌరవ పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కీర్తిని జాతీయస్థాయిలో నిలబెట్టాలని ఆయనను కోరారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలను అందించడం జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa