ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన త్రిపురాణ విజయ్ ఐపీఎల్‌లో చోటు దక్కించుకోవడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. 'శ్రీకాకుళం జిల్లా నుండి ఐపీఎల్‌కు ఎంపికయిన త్రిపురాణ విజయ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ కొత్త అధ్యాయంలో మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa