అదానీ వ్యవహారంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని వైయస్ఆర్‌సీపీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రక్షణశాఖ రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది.
వైయస్ఆర్‌సీపీ తరపున రాజ్యసభ పక్షనేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు. మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ రంగసంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) తనంతకు తాను అత్యంత చౌకగా యూనిట్ విద్యుత్ రూ.2.49తో ఇస్తామని ముందుకొచ్చిందన్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం అని, ఇందులో లంచాలకు తావెక్కడ ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెకీతోనే ఒప్పందాలు జరిగాయి తప్ప.. అదానీతో కాదని తేల్చిచెప్పారు. కావాలనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందన్నారు.