ఏపీ విద్యుత్ శాఖకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖపై వెలగపూడి సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సౌరవిద్యుత్‌కు ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పీఎం సూర్యఘర్, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం ఏర్పాటుపై సమీక్షించారు. కుసుమ పథకం, సోలార్ విలేజ్ కాన్సెప్ట్‌పై మాట్లాడారు. వందశాతం సోలార్ విద్యుత్ కార్యక్రమానికి కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఏపీ ప్రభుత్వం తీసుకుందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
సోలార్ ఎనర్జీ అంశంతో పాటు ఈ నెల 29వ తేదీన అనకాపల్లి జిల్లా పుడిమడకలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన పైనా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. మోదీ చేతుల మీదగా NTPC ద్వారా నేషనల్ గ్రిడ్ ఎనర్జీ లిమిటెడ్, హైడ్రోజన్ హబ్ నిర్మాణానికి పౌండేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఎన్టీపీసీ ద్వారా నేషనల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ , హైడ్రోజన్ హబ్ నిర్మాణానికి ఫౌండేషన్ స్టోన్ వేసే కార్యక్రమ ఏర్పాట్లపైనా సీఎం చంద్రబాబు చర్చించారు. సోలార్ పవర్ కంప్రెసర్డ్ బయోగ్యాస్‌పై ఈ రివ్యూలో సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో మాట్లాడారు.