ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఐడీ మాజీ ఏఎస్పీ విజయపాల్ నేడు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గతంలో మాదిరిగానే ఆయన విచారణకు సహకరించడంలేదని... తెలియదు, గుర్తులేదు అంటూ పొంతన లేని సమాధానాలు ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన కోర్టుల ద్వారా అరెస్ట్ నుంచి రక్షణ పొందుతూ వచ్చారు. అయితే, ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విజయపాల్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అత్యున్నత న్యాయస్థానంలోనే ఆయనకు చుక్కెదురు కావడంతో, అరెస్ట్ తథ్యమని తెలుస్తోంది. ఈ సాయంత్రం విజయపాల్ ను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.