భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను కలవటం గౌరవంగా భావిస్తున్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి బిజీ షెడ్యూల్లో తనకు ఇచ్చిన సమయానికి తాను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జగదీప్ ధన్కర్ తనకు ఎన్నో విలువైన సూచనలు సలహాలు ఇచ్చారని.. తనకు సాదర స్వాగతం పలికిన ఉప రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.