అనంతపురం అర్బన నియోజకవర్గంలో త్వరలో పదివేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజే స్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక రెండో డివిజనలోని వినాయక నగర్, భాగ్యనగర్‌లో మంగళవారం ‘మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర పాలక సంస్థ కమిషనర్ నాగరాజు, సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానంగా ఇళ్లు, డ్రైనేజీ, రేషన సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గతంలో టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించినా అతీగతీలేకుండా పోయిందని ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. ఎమ్మెల్యే స్పందిస్తూ.. గత ఐదేళ్లల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా మాయ మాటలతో కాలయాపన చేశారన్నారు. ఐదేళ్ల క్రితం టీడీపీ హయాంలో ఇళ్ల నిర్మాణలు ఏ దశలో ఉన్నాయో.. అలాగే ఉండిపోయాయన్నారు.