కొత్తగా రేషన్ కార్డులు కావాలనుకునేవారు డిసెంబరు 2 నుంచి 28 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త కార్డులు, మార్పులు, చేర్పులు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విచారించిన తర్వాత అర్హులకు జనవరి 2వతేదీన కొత్త కార్డులు అందజేయినున్నారు.