బంగారం ధరలు భారీగా తగ్గాయి నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర ఏకంగా 1000 రూపాయలు పైన తగ్గింది. గడచిన మూడు నాలుగు రోజులుగా బంగారం ధరలు, వరుసగా తగ్గుతూ వస్తున్నాయి.నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78490 రూపాయలు పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71700 రూపాయలు పలుకుతోంది. బంగారం ధరలు ఈ నెలలో భారీగా తగ్గాయి. ముఖ్యంగా బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయి అయినా 84000 రూపాయల నుంచి 77 వేల రూపాయల వరకు ఈ నెలలో పతనం అయ్యింది. అంటే దాదాపు 7వేల రూపాయలు తగ్గింది. ఈ రేంజ్ లో బంగారం తగ్గడం ఈ సంవత్సరం ఇదే తొలిసారి. బంగారం ధర గడచిన మూడు నెలలుగా గమనించినట్లయితే భారీగా పెరిగింది. జూలై నెలలో బంగారం ధర కేవలం 67 వేల రూపాయలు మాత్రమే ఉంది. అక్కడ నుంచి బంగారం ధర భారీగా పెరుగుతూ 84 వేల రూపాయల వరకు వెళ్ళింది. కానీ అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన రోజు బంగారం ధర భారీగా పతనం అయింది. త్వరలోనే ఆయన పదవీ బాధ్యతలు చేపడతారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పడుతున్నాయి.