మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బైక్ ను తప్పించబోయి అదుపుతప్పి బోర్లా పడటంతో 10 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు.భండారా నుంచి గొండియావెళ్తున్న బస్సుకు అనుకోకుండా ఓ బైక్ ఎదురు రావడంతో దానిని తప్పించే క్రమంలో.. మరోవైపు తిప్పడంతో వేగం కంట్రోల్ అవక బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ.. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు