డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. పాచిపెంటలో రూ. 1. 75 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి, డోలి మోతలు నివారణకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.