పదహారేళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేసిన వ్యక్తిపై కృష్ణా జిల్లా, పెనమలూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. తాడిగడప రాంనగర్‌కట్టపై నివాసముండే రసూల్ తన కుమార్తెకు మాయ మాటలు చెప్పి రెండేళ్లుగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తీసుకెళ్లి లైంగికంగా వేధించి సంబంధం పెట్టుకున్నాడని, ఆమె ప్రస్తుతం రెండు నెలల గర్భవతి అని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.