భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బీసీసీఐ కార్యదర్శి జే షా కలిసి ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో భారత కొత్త వన్డే జెర్సీని ఆవిష్కరించారు. ఈ కొత్త జెర్సీపై ప్రత్యేకమైన ముక్కోణపు డిజైన్‌తో భుజాలపై ఉన్న రంగుల సొగసును అందంగా రూపొందించారు. ఇది డిసెంబర్ 22న వడోదరలో వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో తొలిసారిగా ప్రదర్శించనున్నారు. జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ, ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అని, జెర్సీని తొలిసారిగా ధరించేందుకు ఎంతో ఆనందంగా ఉన్నట్లు పేర్కొంది. “భారత జట్టు జెర్సీ అంటే ఎంతో ప్రత్యేకం. దానిని గెలుచుకోవడానికి చాలా కృషి చేయాలి. భారత అభిమానులు కూడా ఈ జెర్సీని ధరించి గర్వంగా ఫీలవ్వాలి” అని ఆమె అభిప్రాయపడింది.
అయితే భారత మహిళల జట్టు డిసెంబర్ 5 నుండి 11 వరకు ఆస్ట్రేలియాలో మూడు వన్డేలు ఆడేందుకు సిద్ధమవుతోంది. స్వదేశంలో జరగబోయే సిరీస్‌కు ముందు, ఈ పర్యటన జట్టుకు కీలకంగా నిలవనుంది. ఈ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం భారత క్రికెట్ అభిమానులకు మంచి జ్ఞాపకంగా నిలిచింది. జట్టు కొత్త జెర్సీతో మరింత ఉత్సాహంగా నెక్స్ట్ ఛాలెంజ్‌లను ఎదుర్కోవాలని ఆశిస్తోంది.