హార్మోన్ల అసమతుల్యత కారణంగా మహిళల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలితో హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటేయిన్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.రోజుకి 8 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడి పెరిగితే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. కాబట్టి యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేయాలి. రోజూ 4-5 లీటర్ల నీటిని తాగాలి. టీ, కాఫీలు ఎక్కువగా తాగకూడదు. కొబ్బరినూనెలోని ఆరోగ్యకరమైన ఫ్యాటీ ఆమ్లాలు శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.