రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన విశాఖలోని కనక మహాలక్ష్మి ఆలయంలో 2 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న మార్గశిర మాసోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు.
శనివారం దేవస్థానం మీటింగు హాలులో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన వివిధ అంశాలపై చర్చించారు. ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్లు, ఇంకా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.