మౌలిక వసతులు సమకూరాలంటే, పన్నుల వసూలు ముఖ్యమని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని.. అభివృద్ది కోసమే పన్నుల వసూలు అని తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లించకుంటే, చట్టపరంగా ముందుకు వెళ్తామని హెచ్చరించారు.
కొంత సమయం ఇస్తాం. నిర్ణీత సమయంలోపు పన్నులు చెల్లించకుంటే ఇబ్బందులు తప్పవని అన్నారు. ఏపీ వ్యాప్తంగా పన్నుల చెల్లింపు విధానం ఒకేలా ఉంటుంది. నెల్లూరుకు ప్రత్యేకమేమీ ఉండదని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, పెండింగ్‌లో ఉన్న బిల్డింగ్ అనుమతులు పరిష్కరిస్తామని తెలిపారు. నగరంలో 90 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని. త్వరలో మరో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.