రాయచోటి మండలం మూలపల్లెలో 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును సోమవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలవలు, వీధిలైట్లు ఏర్పాటు చేసి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుతామని అన్న్నారు. సిసి రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలన్నారు.