వైకల్యం అనేది శరీరానికే కానీ.. సంకల్పానికి కాదని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు . ఆత్మస్థైర్యంతో తాము ఎవరికీ తీసిపోమని నిరూపిస్తూ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దివ్యాంగులందరికీ ప్రపంచ దివ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.