2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన తరవాత మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నియోజకవర్గ సమన్వయకర్తలలో ఎన్నో మార్పులు చేర్పులు చేసారు. ఇందులో భాగంగానే తాజాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ముద్రగడ గిరిని నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.