రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి చెందిన పట్టాభి ఆగ్రో సంస్థ కాకినాడ పోర్ట్ నుంచి నైజీరియాకు 42,500 టన్నుల పీడీఎస్ బియ్యంను ఎంవి కెనస్టర్ అనే నౌక ద్వారా ఎగుమతి చేస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు సంచలన ఆరోపిణలు చేశారు. దీనిపై తనిఖీలు చేసే ధైర్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్ లకు ఉందా అని ప్రశ్నించారు. పట్టాభి ఆగ్రో సంస్థ ద్వారా ఈ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని, దీనిని తనిఖీ చేయడం ద్వారా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో తమ చిత్తశుద్దిని వారు నిరూపించుకోవాలని ఆయన సవాల్ చేశారు.