ఎస్సీ, ఎస్టీ లపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్ లోని జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో దళితులకు ఎక్కడా అన్యాయం జరగకూడదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలలో స్మశాన వాటికల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.