ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యజమాని ప్రతినెలా మీ పీఎఫ్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారా? లేదా? ఎలా తెలుసుకోవాలి

business |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 08:36 PM

సంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు కచ్చితంగా పీఎఫ్ అకౌంట్ ఉంటుందని చెప్పొచ్చు. కనీసం 20 మందికిపైగా ఉద్యోగులు ఉన్న సంస్థ.. ఈపీఎఫ్ఓలో చేరాలి. మీరు ఈపీఎఫ్ఓ చందాదారులైతే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ప్రతి నెల కూడా వేతనం బేసిక్ పే నుంచి.. 12 శాతం పీఎఫ్ అకౌంట్లో జమ చేయాలి. ఇది మొత్తం ఈపీఎఫ్ అకౌంట్లోకే వెళ్తుంది. ఇక యజమాని కూడా 12 శాతం చొప్పున యాడ్ చేయాలి. ఇందులో 3 శాతానికిపైగా పీఎఫ్ అకౌంట్లోకి.. 8 శాతానికిపైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కు వెళ్తుంది. ఈపీఎఫ్ అకౌంట్‌ను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంటుంది. అయితే.. ఇక్కడ మీ కంపెనీ ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తుందో లేదో కచ్చితంగా తెలుసుకోవాలి.


కొన్ని సార్లు పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్‌కు సంబంధించి చందాదారులకు మెసేజెస్ వస్తుంటాయి. కొన్ని సార్లు రావు. ఇంకా కొందరికి అసలే సందేశాలు అందవు. అయినా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్లో డబ్బులు జమవుతున్నాయో లేదో తెలుసుకోవాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఆ మధ్య బైజూస్ వంటి చాలా కంపెనీలు ఈపీఎఫ్ఓలో.. ఉద్యోగుల పీఎఫ్ నగదును జమ చేయలేదు. ఉద్యోగుల శాలరీ నుంచి కట్ చేసినా.. అకౌంట్లో జమ చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఇలా నిధుల కొరత చాలా కంపెనీలు చేస్తుంటాయి. ఎక్కువగా స్టార్టప్స్‌లో ఇలా ఉంటుందని చెప్పొచ్చు.


 పీఎఫ్ డబ్బులు పడాలంటే యూఏఎన్ యాక్టివేషన్‌లో ఉంచుకోవాలి. కచ్చితంగా ప్రతి నెలా డబ్బులు పడుతున్నాయో లేదోనని చెక్ చేసుకుంటూ ఉండాలి. పీఎఫ్ బ్యాలెన్స్ కోసం పీఎఫ్ మెంబర్స్ పోర్టల్ లాగిన్ కావడం ద్వారా పాస్‌బుక్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇంకా.. ఉమంగ్ యాప్, 9966044425 నంబర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఎస్ఎంఎస్ సదుపాయం కూడా ఉంటుంది. అప్పుడు మీరు స్టేట్మెంట్ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఉద్యోగం మారినప్పుడు.. పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన బాధ్యత కూడా కంపెనీ మీద ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారానే ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.


మీరు పనిచేసే కంపెనీ ఒకవేళ దివాలా తీసినా కూడా లేదా కార్యకలాపాలు మూసేయాల్సి వచ్చినా.. మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇతర అన్ని అప్పుల్ని తీర్చేయకముందు.. ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు చెల్లించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. మీ పీఎఫ్ అకౌంట్లో యజమాని.. ప్రతి నెలా పీఎఫ్ డబ్బులు వేయకపోయినట్లయితే.. ఇది మీరు గమనిస్తే ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ గ్రీవియెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో రిజిస్టర్ కావాలి. ఇక్కడ నేరుగా కంప్లైంట్ చేయొచ్చని తెలుస్తోంది. మీ జోన్ నోడల్ ఆఫీసర్‌ను కూడా సంప్రదించొచ్చు. అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లో ఎంప్లాయీస్ సెక్షన్లో ఈ ఆఫీసర్ల లిస్ట్ కూడా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com