కాకినాడ పోర్ట్ వేదికగా ప్రజా పంపిణి వ్యవస్థ బియ్యం విదేశాలకు తరలించడంపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యా్ప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ బృందంలో సభ్యులుగా బి ఉమామహేశ్వర్, టి అశోక్ వర్ధన్, ఎం. బాలసుందర్రావు, ఆర్ గోవిందరావు, ఎం రత్తయ్యలు నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్ 2103ను సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జారీ చేసింది.ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ కేసుకు సంబంధించిన పురోగతిపై నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది. అలాగే సిట్‌కు పూర్తి స్థాయి అధికారాలు కట్టబెట్టింది. పోర్టు ద్వారా బియ్యం విదేశాలకు రవాణా, కాకినాడ జిల్లాతోపాటు అందుకు సంబంధిత నేరాలపై విచారణ జరపాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా సిట్‌కు.. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం అందించేందుకు సహకరించాలని సూచించింది.