ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రెవెన్యూ సదస్సులు చేపడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. బాపులపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఇవాళ(శుక్రవారం) రెవెన్యూ సదస్సు జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిపై యార్లగడ్డ వెంకట్రావు కౌంటర్లు వేశారు.ఈ సదస్సులో యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కులో మహిళలకు 50శాతం కల్పించారని యార్లగడ్డ వెంకట్రావు గుర్తుచేశారు.ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తిని జగన్ ఇవ్వాలని అన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పుడు గుంటలు పూడ్చే పరిస్థితి తమ ప్రభుత్వానికి వచ్చిందని అన్నారు. రాష్ట్ర మొత్తం మీద గన్నవరం నియోజకవర్గంలో రెవెన్యూ రికార్డులు ఎక్కవగా తారుమారు చేశారని అన్నారు. గత10 సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేసిన ఎమ్మార్వోలు తప్పులు చేస్తే ఎవరిని వదిలే ప్రసక్తి లేదని యార్లగడ్డ వెంకట్రావు హెచ్చరించారు.