విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. రాజాం మండలం పొగిరి జడ్పీ హైస్కూల్లో శనివారం జరిగిన మెగా టీచర్స్, పేరెంట్స్ డే కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.
విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థుల ప్రవర్తన శైలిని తల్లిదండ్రులు నిత్యం గమనించాలని కోరారు. పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.