బొబ్బిలి పట్టణం మల్లంపేటలో అయ్యప్పస్వామి దేవాలయంలో గురుస్వామి శ్రీ రామనారాయణ మూర్తి స్వామి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యం స్వామి షష్టి నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచి స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు.
అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు, మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన, మాజీ హైకోర్టు న్యాయమూర్తి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.