ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్స్‌లో విలాస వంతమైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. రూ. 50 కోట్ల విలువైన ఈ విలాసవంతమైన ఫ్లాట్, ఈ ప్రాంతంలోని నివాస ప్రాపర్టీ ధరలకు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందట.చదరపు అడుగు ధర రూ.59,500 పలికిందని సమాచారం. ఈ భవనంలోని పదహారవ అంతస్తులో ఉన్న ఈ లగ్జరీ ఫ్లాట్ సుమారు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇందులో నాలుగు బెడ్‌రూమ్‌లు ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు ఐదు కార్లు పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అయితే.. నారాయణ మూర్తి ఈ వార్తకు సంబంధించి వివరణ ఇవ్వలేదు.యూబీ సిటీలోని కింగ్‌ఫిషర్ టవర్స్ నగరం నడిబొడ్డున 34-అంతస్తులు నిర్మించారు. ఇందులో 81 విలాసవంతమైన నివాసాలు ఉన్నాయి. ఇందులోనే ప్రముఖ వ్యాపారవేత్త కిరణ్ మజుందార్ షా, కర్ణాటక మంత్రి కేజీ జార్జ్ కుమారుడు రాణా తదితర ప్రముఖులు నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ విలాసవంతమైన కింగ్‌ఫిషర్ టవర్స్‌లో నాలుగేళ్ల క్రితం నారాయణమూర్తి భార్య సుధామూర్తి పేరుపై ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. 23వ అంతస్తులో ఉన్నఈ ఫ్లాట్ ధర రూ.29కోట్లకు కొన్నారు.