సీతానగరం మండలం కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ సమావేశంలో సర్పంచ్ రెడ్డి అనిత అప్పలనాయుడు శనివారం పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకర్షించాయి.
గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. పిల్లల బంగారు భవిష్యత్తు, నాణ్యమైన చదువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.