చలికాలంలో ఉదయం వేళ చలి తీవ్రతతో పాటు మంచుకూడా కురుస్తుందని, ఈ సమయంలో సాధ్యమైనంతవరకూ వృద్ధులు, ఆస్తమా పేషంట్లు బయటకు వెళ్లకపోవడమే మంచిదంటున్నారు. ఉదయం వాకింగ్ వెళ్లేవారు, వివిధ వ్యాయామాలు చేసేవారు ఓవర్ ఎగ్జైట్ కావద్దని సూచిస్తున్నారు. అధిక వర్కవుట్స్ వల్ల గుండెపై భారం పడుతుందని, అది హార్ట్‌ఎటాక్‌కు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బేకరీ ఫుడ్, ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన ఆహారం, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవాలని, తగినంత నీరు తాగాలని సూచిస్తున్నారు. వింటర్‌లో తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. ఈ సమయంలో ఎక్కువగా ఊపిరి తిత్తుల సబంధిత సమస్యలు, డయేరియా లాంటి సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉందని కనుక జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.