శబరి కొండపైకి వెళ్ళేటప్పుడు భక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయ్యప్ప ఆలయానికి నడిచి వెళ్లే భక్తులు మాలధారణ చేసిన సమయంలో కూడా నడకను అలవాటు చేసుకోవాలి. లేదంటే ఒకేసారి నడిచి వెళ్లాలంటే అసౌకర్యం కలుగుతుంది. తీర్థయాత్రకు వెళ్లడానికి ముందే నడకను, కొన్ని వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలి. ఫిట్నెస్ అంతగా లేనివారు కొండపైకి ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన చోట ఆగి విశ్రాంతి తీసుకుని వెళ్లాలి. భోజనం చేసిన వెంటనే కొండపైకి ఎక్కడం చేయకూడదు.