శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురంలో క్షుద్రపూజలు కలకలం..గీత అనే మహిళ ఇంటిముందు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. నడిరోడ్డుపై ముగ్గేసి దాని చుట్టూ, మంత్రించిన నిమ్మకాయలు, దిష్టిబొమ్మ వుండటంతో చేతబడి చేసారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తమ గ్రామంలో ఇలా జరగటం మొదటిసారని, ఎప్పుడు ఎమ్ జరుగుతుందోనని గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు.