నెక్కొండ మండలం అప్పలరావుపేట జెడ్పి హైస్కూల్ లో సోమవారం సమగ్ర శిక్ష పథకంలో భాగంగా ప్రధానోపాధ్యాయుడు రవీందర్ మాట్లాడుతూ బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కోరారు రాణి లక్ష్మీ బాయి ఆత్మ రక్ష ప్రశిక్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మూడు నెలలపాటు బాలికలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, బాలికలకు పాఠశాల స్థాయి నుంచి స్వీయ రక్షణలో శిక్షణను ఇచ్చేందుకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గడ్డం రాజు విద్యార్థులకి శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు శ్రవణ్ కుమార్, రవీంద్రనాథ్, యాకయ్య, భూలక్ష్మి, వెంకట్రాజం, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.