గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు ఆరోపించారు. మన్యం జిల్లాలో అచ్చెనాయుడు సోమవారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కింజరాపు అచ్చెనాయుడు పాల్గొన్నారు. నరిసిపురం వద్ద ఎన్టీఆర్ విగ్రహనికి పూల మాల వేసి కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యరాణి, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కింజరాపు అచ్చెనాయుడు మీడియాతో మాట్లాడుతూ...విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీటి, సాగునీటిపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అధికారుల సమీక్షాలో మంత్రి అచ్చెనాయుడు కీలక సూచనలు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది కానీ సేవలు అందించేందుకు అధికారులు కరువయ్యారని అన్నారు. గిరిశికర గ్రామాలకు రానున్న రెండు సంవత్సరాల్లో కనీసం అంబులెన్స్‌లు వెళ్లేందుకు రోడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో సమీక్ష చేసిన చిల్లిగవ్వ నిధులు లేవని అన్నారు. నిధులు వచ్చే విధంగా కార్యచరణ చేపెడతామని మంత్రి కింజరాపు అచ్చెనాయుడు పేర్కొన్నారు.