పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ వైద్య సిబ్బందికి సూచించారు. పసుపుల ఫుడ్స్ చైర్మన పసుపుల శ్రీరామిరెడ్డి మండల కేంద్రంలోని అర్బన హెల్త్ సెంటర్లో గర్భిణులకు ఏర్పాటు చేసి న భోజన వసతిని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన హెల్త్ సెంటర్ లోని సౌకర్యాలను, మందులను, రికార్డులను తని ఖీ చేశారు. రోగలకు వైద్యం అందించే విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దన్నారు. ఈ కార్యక్రమం లో వైద్యాధికారి స్వాతి, తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ సాల్మన, ఎంపీపీ సునీత, టీడీపీ జిల్లా సీనియర్ నాయకులు పసుపుల శ్రీరామిరెడ్డి, లక్ష్మీనారాయణ, హనుమంతరెడ్డి, కేశన్న, రవీంద్ర, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.