దర్శకుడు రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ లభించింది. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌పై అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే దర్యాప్తుకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని వర్మకు హైకోర్ట్ స్పష్టం చేసింది.