రాజధాని అమరావతి పనులు ఇకపై ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోనున్నాయి. ఆగిపోయిన పనులను వెంటనే పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 20 పనులకు ఇటీవల సీఆర్‌డీఏ అథారిటీ మీటింగ్ ఆమోదం తెలిపింది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. రాజధానిలో అసంపూర్తి గా ఉన్న 20 పనులకు మొత్తం 11 వేల 467 కోట్ల రూపాయలకు సర్కార్ పరిపాలన ఆమోదం తెలిపింది. జీవో నంబర్ 968 ప్రభుత్వం జారీ చేసింది.