రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీంతోపాటు 24 గంటల్లోనే రైతులకు అందుకు సంబంధించిన డబ్బులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసే క్రమంలో ఒక్క కేజీ కూడా తడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లదేనని సీఎం పేర్కొన్నారు.ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.
ఆ క్రమంలో అధికారులు, రైస్ మిల్లర్ల వల్ల రైతులు ఏదైనా ఇబ్బందులు పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గత ప్రభుత్వ హాయాంలో తడిసిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు ఎంతో ఇబ్బంది పడ్డారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఈసారి మాత్రం రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.