కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. 'సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులను మోసం చేసింది.
పచ్చ బట్టలేసుకుని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైన్ షాపులను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని మద్యంధ్రప్రదేశ్‌గా మార్చింది' అని మండిపడ్డారు.