అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్డులో గల విద్యుత్ కార్యాలయం నందు విద్యుత్ ఛార్జీలు పెంపుకు నిరసనగా శుక్రవారం వైయస్సార్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతుందని నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త హనిమిరెడ్డి గురువారం
పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న వైసిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.