నెల్లూరు జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలతో నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఏకంగా కాజ్వేపైకి ప్రవహించడంతో కాజ్ వేపై రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. దీంతో మేనకూరు సెజ్ పరిధిలోని పలు పరిశ్రమలకు వెళ్లే వాహనాలు స్వర్ణముఖి నది వద్ద స్తంభించాల్సిన పరిస్థితి నెలకొంది. నది వద్ద పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తగు జాగ్రత్తలు చేపట్టారు.