మహిళలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రెండో పట్టణ పోలీసులు గురువారం తెలిపారు. పెందుర్తికి చెందిన జయ గంగాధర కృష్ణ, కే రత్నం, కప్పరాడకు చెందిన శ్యామ్ సుందరరావు యువతుల ఫోటోలను దీపక్ కు అందజేసేవారు. దీపక్ ఫోటోలను వెబ్ సైట్లో పెట్టి ఆ యువతులతో వ్యభిచారం చేయించేవాడు. ఇటీవల దీపక్ ను అరెస్ట్ చేయగా అతనిచ్చిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ తిరుమలరావు తెలిపారు.