స్వర్ణాంధ్ర విజన్ - 2047 పేరుతో సీఎం చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ దశ - దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు కాదని.. విభజన హామీలన్నారు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలపాలంటే నెరవేరాల్సింది కేంద్రం ఇచ్చిన హామీలు అని అన్నారు. దశాబ్ద కాలంగా విభజన హామీలను గాలికి వదిలేశారని.. పూర్తిగా అటకెక్కించారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో అనాడు యూపీఏ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa