AP: ఉత్తర భారతదేశంతో వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం మినహా మిగిలిన జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటె తక్కువకు పడిపోయాయి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో 18 డిగ్రీల కంటే తక్కువగా, ఏజెన్సీ ప్రాంతాల్లో 16 డిగ్రీల కంటే దిగువన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్లూరి జిల్లా కుంతల గ్రామంలో అత్యల్పంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.