వడ్డాది పెద్దేరు కాలువ చైర్మన్ ఎన్నికలు శనివారం నిర్వహించగా కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్ గా దాడి పెద్ద గోవింద్, వైస్ చైర్మన్ గా లక్ష్మణ మూర్తి( కోయిలపల్లి) ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకి, జనసేన ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజుకి అభ్యర్థుల ధన్యవాదములు తెలుపుకున్నారు. మాజీ కోపరేట్ ప్రెసిడెంట్ సన్యాసిరావు, నర్సింహా మూర్తి, డిఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.