అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా ఆదివారం ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో శ్రీరాములు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు మాట్లాడేవారికి భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు నిరాహారదీక్ష చేసి తెలుగుజాతి కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసినట్లు తెలిపారు.