రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి అధికారులు సభ్యులకు తెలియజేయాలని బొండపల్లి ఎంపీపీ చల్లా చల్లంనాయుడు సూచించారు. ఆదివారం బొండపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మండలంలో పలు గ్రామాల సర్పంచులు విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకున్నారు. ఎంపీడీవో గిరిబాల, తహసిల్దార్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.