చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన నివాసం నందు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ఉదయం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగిందన్నారు. దీంతో ప్రతి నియోజకవర్గంలో ఆయా ఎమ్మెల్యేలు భూ సమస్యలపై ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.