కొండాపూర్ మండలం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందన్న ప్రచారంలో వాస్తవం లేదని ఆర్డీవో రవీందర్ రెడ్డి తెలిపారు. డీఎస్పీ సత్తయ్య గౌడ్ తో కలిసి ఆదివారం గురుకుల పాఠశాలను సందర్శించారు. 6, 10వ తరగతి విద్యార్థులు వేరువేరుగా విచారించారు. విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిందని తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. వారి వెంట సిఐ వెంకటేశ్వర్ ఉన్నారు.