వివాహం తరువాత మంచి భర్త, సంతోషకరమైన కాపురం పెట్టుకొని ఒక మహిళ మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఆ యువకుడు ఒక సైకో అని తరువాత తెలిసింది.ఆ యువకుడి మోజులో భర్తను కాదని ఇల్లు వదిలి పారిపోయింది. కానీ ఇంట్లో ఉండే ఒక బాలిక వల్ల దొరికిపోయారు. ఈ ఘటన ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ వద్ద జరిగింది.వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ సమీపంలో గురుగ్రామ్ వద్ద రేవాడీ గ్రామానికి చెందిన అనుపమ (27, పేరు మార్చబడినది) అనే యువతికి రెండేళ్ల క్రితం అర్జున్ (30)తో వివాహం జరిగింది. అర్జున్ ఇంట్లో అతని సోదరుడి కుమార్తె పింకీ (13) కూడా ఉండేది. పింకీ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. ఆమె తండ్రి ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండడంతో.. పింకీ తన చిన్నాన్న అర్జున్ వద్దనే ఉండేది. ఈ క్రమంలో అర్జున్ భార్య అనుపమకు సోషల్ మీడియా ద్వారా అరున్ అనే 26 ఏళ్ల యువకుడు పరిచయమయ్యాడు. అతను అదే ప్రాంతంలోని ఒక గాజుల (బ్యాంగిల్స్) షాపులో ఉద్యోగం చేస్తున్నానని అనుపమకు చెప్పాడు.
అరుణ్ అందగాడు కావడంతో అనుపమ అతనితో రోజూ మాట్లాడేది. ఆ తరువాత తరుచూ కలుసుకోవడం ప్రారంభించారు. సినిమాలకు, షికార్లు తిరిగే వారు. ఈ విషయాలన్నీ ఆమె భర్త అర్జున్ కు తెలియవు. అనుపమ పూర్తిగా అరుణ్ మాయలో పడిపోయింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. బయట ఎక్కడైనా కలిస్తే ప్రమాదమని.. ప్రతి రోజు రాత్రి తన భర్త అర్జున్ కు భోజనంలో నిద్ర మాత్రలిచ్చి.. అతను నిద్రపోయాక.. ఇంట్లో అరుణ్ ప్రవేశించేవాడు.పడక గదిలో అర్జున్ నిద్రపోతూ ఉండగానే.. అనుపమ తన ప్రియుడితో శారీరక సుఖం పొందేది. ఇలా కొన్ని రోజుల పాటు సాగింది. కానీ కొన్ని రోజుల క్రితం అర్జున్ అన్న కూతురు పింకీ ఆ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో రాత్రి తన పిన్ని, మరో యువకుడితో ఆ పనిచేస్తుండగా.. పింకీ చూసింది. పింకీ ఎవరికైనా తమ రహస్యం చెప్పేస్తుందేమోనని భయపడ్డారు. అందుకే ఆమెను కత్తి చూపించి ఎవరికైనా విషయం చెబితే చంపేస్తామని బెదిరించారు. కానీ అరుణ్ పింకీని అంతటిత వదల్లేదు.
మరుసటి రోజు పింకీ ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను తుపాకీతో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో పింకీ భయపడిపోయింది. అరుణ్ ఇలా ఒకసారి కాదు రెండు సార్లు చేశాడు. కొన్ని రోజుల తరువాత అర్జున్ వదిలి అనుపమ, తన ప్రియుడి అరుణ్ తో పారిపోయింది.ఇద్దరూ పారిపోయిన తరువాత తన భార్య కనపడడం లేదని అర్జున్ ఆందోళన చెందుతుండగా.. అప్పుడు పింకీ జరిగినదంతా వివరాంగా చెప్పింది. అర్జున్ వెంటనే పింకీని తీసుకొని పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు పింకీ మైనర్ కావడంతో కేసు వెంటనే నమోదు చేయలేదు. దీంతో అర్జున్ చైల్డ్ వెల్ఫేర్ అధికారుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.
చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పింకీకి వైద్య పరీక్షలు జరిపి.. పోలీసులకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. నిందితుడు అరుణ్ ని అరెస్ట చేయాలని ఆదేశించారు. పోలీసులు అరుణ్ గురించి విచారణ చేయగా.. అతను ఒక ఫ్రాడ్ అని.. అతని అసుల పేరు ఇర్ఫాన్ అని తేలింది. పోలీసులు అనుపమ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి ఆమెను పట్టుకున్నారు. కానీ అరుణ్ పరారీలో ఉన్నాడు. అయితే త్వరలోనే అతడిని పట్టుకుంటామని గురుగ్రామ్ పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.