ఏపీ హైకోర్టులో సజ్జల భార్గవ్‌రెడ్డికి ఊరట లభించింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో తనపై నమోదైన 9 కేసులు కొట్టివేయాలని సజ్జల భార్గవ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
నేడు విచారణ జరిపిన హైకోర్టు.. రెండు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భార్గవ్ రెడ్డి క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.